హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొలాల్లో వ్యర్థాలను తగలబెడుతున్న రైతులు

JN: జిల్లా వ్యాప్తంగా రైతులు వరి కోతల తర్వాత మిగిలిన వ్యర్థాలను తగలబెడుతున్నారు. వ్యవసాయ అధికారులు పదేపదే హెచ్చరించినా, అవగాహన లోపంతో వరి కొయ్యలను తగలబెట్టడం వల్ల భూసారం తగ్గడం, తీవ్రమైన వాయు కాలుష్యం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి, గ్రామీణ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిపుణులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.