హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆలయ పనుల అడ్డగింతపై తహసీల్దార్‌కు వినతి

MDK: అక్కన్నపేట గ్రామ శివారులో బీరప్ప, మల్లన్న స్వామి ఆలయ నిర్మాణ పనులను పక్క పొలాల వారు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ కురుమ సంఘం అధ్యక్షుడు శ్రీశైలం ఆధ్వర్యంలో 30 కుటుంబాల సభ్యులు సోమవారం ప్రజావాణిలో తహసీల్దార్ రజనీకుమారికి వినతిపత్రం ఇచ్చారు. స్థలాన్ని పరిశీలించి కబ్జాదారులపై చర్యలు తీసుకుని ఆలయ భూమిని కాపాడాలని కోరారు.