GDWL: కేటీదొడ్డి మండలం వెంకటాపురం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల అనంతరం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పర్యవేక్షకురాలు వెంకటేశ్వరి ఆధ్వర్యంలో చేపట్టిన లెక్కింపులో నోట్ల రూపంలో రూ.9,48,640, నాణేల రూపంలో రూ.1,02,266 కలిపి మొత్తం రూ.10,50,906 ఆదాయం వచ్చినట్లు ఈవో పురేందర్ కుమార్ తెలిపారు.
తెలంగాణ
ఆలయ హుండీ ఆదాయం రూ.10.50 లక్షలు


