హైదరాబాద్: 28°C
తెలంగాణ

ACB పగ్గాలు చేపట్టనున్న ఐపీఎస్ అధికారి

HYD: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్‌గా ఐపీఎస్ అధికారి ఎస్. చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం మల్టీ జోన్-1 ఐజీగా ఉన్న ఆయనకు నవంబర్ 12న ప్రభుత్వం ఏసీబీ బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి మెదక్ ఎస్పీగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. సంగారెడ్డి ఎస్పీ, రామగుండం సీపీ, ఐజీపీ పర్సనల్, మల్టీ జోన్-1 ఐజీగా వివిధ హోదాల్లో పనిచేశారు.