SRD: కంగ్టి మండలం దెగుల్వాడి గ్రామంలో పది రోజుల క్రితం జరిగిన అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన గునె జెరప్ప (46) హత్యకు గురైనట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో మృతుడి భార్య గునె బుజ్జమ్మ (36)ను నిందితురాలిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు సోమవారం సీఐ వెంకట్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ
అనుమానాస్పద మృతి కేసు ఛేదన.. భార్య అరెస్ట్


