హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళ్యాణ మండపం నిర్మాణానికి స్పీకర్ భూమిపూజ

VKB: మోమిన్‌పేట్ మండలం ఎన్కతలలోని శ్రీ శంకర భారతి మహారాజ్ ఆశ్రమ శనైశ్చర స్వామి ఆలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఆలయ చైర్మన్‌గా బొడ్డు శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కళ్యాణ మండపం నిర్మాణానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భూమిపూజ చేశారు. నెల రోజుల్లో గ్రామాభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు తీసుకొస్తామని ఈ సందర్భంగా స్పీకర్ హామీ ఇచ్చారు.