హైదరాబాద్: 28°C
తెలంగాణ

సొంత చెల్లెలిపై దాడి కేసులో నిందితుడికి జైలు శిక్ష

ADB: సొంత చెల్లెలిపై కట్టెతో దాడి చేసి గాయపరిచిన కేసులో సోనాలకు చెందిన తుల దేవేందర్‌కు బోథ్ కోర్టు ఒక నెల సాధారణ జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. 2023లో నమోదైన ఈ కేసులో సాక్ష్యాధారాలు రుజువు కావడంతో న్యాయమూర్తి కుంభ సందీప్ ఈ శిక్ష ఖరారు చేశారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు సిబ్బంది, ఏపీపీని SP అభినందించారు.