హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ అభివృద్ధికి రూ.4 కోట్ల నిధులు

NGKL: కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలోని గుట్టపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.4 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో ఆలయ అభివృద్ధితో పాటు బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం ద్వారా భక్తులకు రాకపోకల సౌకర్యం మరింత మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు.