హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో స్వయంపాలన దినోత్సవం

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం స్వయం పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల అవతారం ఎత్తి తరగతి గదుల్లో పాఠాలు బోధించారు. ఉపాధ్యాయుల బాధ్యతలను స్వయంగా నిర్వహిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది.