SRPT: ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 114 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఆయా ఫిర్యాదులను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులకు పంపించినట్లు వెల్లడించారు.
తెలంగాణ
సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలి: కలెక్టర్


