హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫరూఖ్‌నగర్ ప్రజావాణికి ఐదు ఫిర్యాదులు

RR: ఫరూఖ్‌నగర్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణికి ఐదు ఫిర్యాదులు అందాయి. వీటిలో మున్సిపల్ శాఖకు సంబంధించి మూడు, విద్యుత్ శాఖకు సంబంధించి రెండు అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 16 మంది అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.