HYD: లాలాపేట సాయినగర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, కేటాయింపుల్లో జాప్యంపై ఎమ్మెల్యే పద్మారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.9 కోట్లతో నిర్మిస్తున్న 104 ఇళ్ల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతతో పాటు మౌలిక వసతులు కల్పించి, అర్హులైన నిరుపేదలకు ఇళ్లను కేటాయించాలని సూచించారు. ఈ సమీక్షలో తహసీల్దార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
104 ఇళ్ల పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే


