RR: కొందుర్గు మండలంలోని దివ్యశక్తి పేపర్ మిల్లు యాజమాన్యంపై రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లు 384, 385, 386లోని తమ పట్టా భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పంట పొలాల్లోకి విషపూరిత నీటిని వదులుతూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని ఆరోపించారు. రైతుల రాకపోకలకు అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
పేపర్ మిల్లుపై రైతుల ప్రజావాణి ఫిర్యాదు


