హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయాలి'

GDWL: జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన చేనేత కార్మికులందరికీ చేయూత ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.