హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారిశుద్ధ్య పనులపై అధికారులకు క్లాస్

MDCL: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై కమిషనర్ వినయ్ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. మౌలాలి సర్కిల్-4 పరిధిలోని సఫిల్‌గూడ, వినాయక్‌నగర్, ద్వారకామాయి కాలనీ, షఫీనగర్, ఎస్పీ నగర్ ప్రాంతాల్లో పర్యటించి చెత్త పేరుకుపోయిన ప్రాంతాలు, పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ పనులను పరిశీలించారు. చెత్తను రోజూ తొలగించాలని అధికారులను ఆదేశించారు.