హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏపీ నిర్మాణాలపై KRMBకి ఫిర్యాదు

HYD: నాగార్జునసాగర్ వద్ద ఏపీ చేపట్టిన నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని KRMBకి ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. KRMB, CWC, తెలంగాణకు సమాచారం ఇవ్వకుండానే ఏపీ పనులు ప్రారంభించిందని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం శ్రీశైలం, సాగర్ జలాలను ఏపీకి అప్పగిస్తోందని, దీంతో ఐదు జిల్లాల్లో 2.5 కోట్ల మందికి తాగు, సాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయని విమర్శించారు.