హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడేళ్లుగా పూర్తికాని బీటీ రోడ్డు పనులు

RR: షాద్‌నగర్ పరిధిలో నాట్కో పరిశ్రమ నుంచి దుస్కల్–కోల్బాయ్ తండా వరకు బీటీ రోడ్డు పనులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. 2018లో రూ.94.50 లక్షలతో మంజూరైన పనులు కంకర పరిచిన దశలోనే నిలిచిపోయాయి. దీంతో రహదారి గుంతలమయమై 10 పరిశ్రమల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.