హైదరాబాద్: 28°C
తెలంగాణ

తారానగర్ రోడ్డుపై ప్రమాదకరంగా మ్యాన్‌హోల్స్

RR: లింగంపల్లిలోని తారానగర్ హోల్‌సేల్ మార్కెట్ రహదారిపై మ్యాన్‌హోల్ మూతలు పూర్తిగా దెబ్బతిని కుంగిపోయాయి. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు వెంటనే స్పందించి దెబ్బతిన్న మూతలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.