హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ

NRML: నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ జానకి షర్మిల ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, చట్టపరిధిలో బాధితులకు సకాలంలో న్యాయం అందించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.