హైదరాబాద్: 28°C
తెలంగాణ

'క్షేత్రస్థాయి శిక్షణతో సమర్థ అధికారులుగా ఎదగాలి'

JGL: క్షేత్రస్థాయి శిక్షణతో సమర్థ అధికారులుగా ఎదగాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. 24 వారాల ప్రాక్టికల్ శిక్షణకు వచ్చిన ట్రైనీ డీఎస్పీలు తేజస్విని, నరేందర్‌లు సోమవారం జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయనను కలిసి పూలమొక్క అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ, నేర పరిశోధన, శాంతిభద్రతలు, మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.