హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి: TSJU

MDCL: తెలంగాణ జర్నలిస్టులకు సామాజిక భద్రత, పింఛన్ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని TSJU నేతలు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని NUJ (I) జాతీయ కార్యదర్శి చంద్రమోహన్ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.