హైదరాబాద్: 28°C
తెలంగాణ

72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన

MDK: కార్తిక చతుర్దశి సందర్భంగా పెద్దశంకరంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధ్యక్షురాలు రాగం అర్చన నేతృత్వంలో 72 జంటలు ఒక్కొక్కరు లక్ష వత్తులతో దీపారాధన చేశారు. తులసీ దామోదర కల్యాణం, శివాభిషేకం నిర్వహించారు. దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.