హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వారసత్వ సంపద పరిరక్షణలో యువత భాగస్వాములు కావాలి'

KNR: ప్రపంచ వారసత్వ వారోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్‌ SRR ప్రభుత్వ కళాశాల యువ టూరిజం క్లబ్, హెరిటేజ్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కె. రామకృష్ణ, హెరిటేజ్ శాఖ ఏడీ ఏ. సాగర్ మాట్లాడుతూ.. చారిత్రక కట్టడాలు, సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణలో యువత చురుకుగా భాగస్వాములు కావాలని అన్నారు.