హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సమస్యల పరిష్కారానికి వినతి

BHNG: విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ వెంకటేశం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈరోజు ఎంపీడీఓకు వినతిపత్రం అందజేసింది. గ్రామంలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు, థర్డ్ వైర్ వేయడం, విద్యుత్ లైన్ల షిఫ్టింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యలపై విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు విజ్ఞప్తి చేశారు.