వనపర్తి పట్టణంలో సోమవారం మున్సిపల్ అధికారులు పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ట్రేడ్ లైసెన్స్‌లు రెన్యువల్ చేయని, కొత్తగా లైసెన్స్ పొందని దుకాణాలపై చర్యలు తీసుకున్నారు. కమిషనర్ నిరంజన్ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు నడుమ లైసెన్స్ లేని షాపులను మూసివేసి తాళాలు వేసి సీల్ చేశారు. దుకాణ యజమానులు మున్సిపాలిటీలో ట్రేడ్ లైసెన్స్‌లు పొందాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: దుకాణాలకు తాళాలు


