ASF: కాగజ్ నగర్ పట్టణంలోని న్యూ కాలనీలో గల సాయిబాబా మందిరంలో సోమవారం సత్య సాయిబాబా 101వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో MLA హరీష్ బాబు పాల్గొని సాయిబాబా వారికి హారతులిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. సత్య సాయిబాబా ప్రపంచానికి జ్ఞానాన్ని ఆపాదించిన వారని, వారి అడుగుజాడల్లో భక్తులు నడిచి వారి దివ్యజ్ఞానాన్ని పొందాలన్నారు.
తెలంగాణ
సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు


