హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ఆరుతడి పంటలే వేయాలి’

MHBD: యాసంగిలో భూగర్భ జలాల కొరత దృష్ట్యా వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని మహబూబాబాద్ మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు రైతులకు సూచించారు. సోమవారం కోట్యానాయక్ తండాలో సర్పంచ్ ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పెసర, మినుము, జొన్న, వేరుశనగ సాగుతో తక్కువ పెట్టుబడితో మెరుగైన ఆదాయం పొందవచ్చన్నారు. అనంతరం పంటలను పరిశీలించారు.