హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిమ్స్‌లో రూ.50 కోట్లతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం: MLA

ADB: ఆదిలాబాద్ రిమ్స్‌లో 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్ల పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు MLA పాయల్ శంకర్ సోమవారం తెలిపారు. భవన నిర్మాణం, వైద్య పరికరాల కోసం ఈ నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా జిల్లాతో పాటు సరిహద్దు ప్రాంతాల గర్భిణులు, నవజాత శిశువులకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు.