హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో మూడు ఫిర్యాదులు స్వీకరణ

MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి నోడల్ అధికారి, ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి ప్రజల నుంచి మూడు దరఖాస్తులను స్వీకరించారు. తిరుమలగిరి గ్రామానికి చెందిన రెండు రెవెన్యూ ఫిర్యాదులు, మరో గ్రామానికి చెందిన ఒక ఫిర్యాదు అందాయని, వాటిని సంబంధిత శాఖలకు అందజేస్తామని ఆయన తెలిపారు.