హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిమ్స్ ఆసుపత్రిని తనిఖీ చేసిన కొత్త డైరెక్టర్ డాక్టర్ బలరాం చిట్కే

ADB: ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బలరాం చిట్కే జనరల్ ఆసుపత్రిని సోమవారం సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఎమర్జెన్సీ, వివిధ వార్డులు, ల్యాబ్‌ను తనిఖీ చేసి, పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని బలరాం చిట్కే సూచించారు.