హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి వార్డులో సీసీ రోడ్లు పూర్తి చేస్తాం'

RR: తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలోని 3, 5వ వార్డుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను సర్పంచ్ సొల్లు రంగమ్మ ప్రారంభించారు. గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి వార్డులో సీసీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎన్నెడ్ల రవీందర్ రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.