హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేతనాలు చెల్లించాలని వినతి: BMS

SRD: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల వేతనాలు చెల్లించాలని BMS జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ కు ఇవాళ వినతి పత్రం సమర్పించారు. 5 నెలలుగా వేతనాలు అందక స్కావెంజర్ల కుటుంబ పోషణ భారంగా మారిందని కలెక్టర్ తెలిపారు. వారం రోజుల్లో వేతనాలు చెల్లిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు నర్సింహారెడ్డి తెలిపారు.