హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదేళ్లుగా అద్దె భవనంలో పోలీస్ స్టేషన్

RR: జిల్లేడు చౌదరిగూడలో పోలీస్ స్టేషన్ పదేళ్లుగా అద్దె భవనంలోనే అరకొర వసతులతో కొనసాగుతోంది. విష కీటకాల మధ్య విధులు నిర్వహించాల్సి వస్తోందని పేర్కొంటూ శాశ్వత పోలీస్ స్టేషన్ భవనం నిర్మించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు మండల అధ్యక్షుడు రాములు, ఉపాధ్యక్షుడు జి. నర్సింలు, ప్రధాన కార్యదర్శి జె. జోసఫ్ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.