హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐదుగురు ట్రైనీ డీఎస్పీలకు శిక్షణ ప్రారంభం

MBNR: జిల్లాకు కేటాయించిన ఐదుగురు ట్రైనీ డీఎస్పీలు సోమవారం ఎస్పీ డి. జానకిను కలిసి శిక్షణ కోసం రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ విధులు, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణపై పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో అనుభవం సంపాదించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వీరి శిక్షణ 2027 మే 9 వరకు కొనసాగనుంది.