హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీడియో కాల్స్‌తో అరెస్ట్ చేయరు: పోలీసులు

HYD: పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్స్ ద్వారా అరెస్ట్ చేయరని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల పేరుతో వీడియో కాల్స్ చేసి భయపెట్టి డబ్బులు వసూలు చేసే ‘డిజిటల్ అరెస్ట్’ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి కాల్స్ వస్తే డబ్బులు చెల్లించకుండా వెంటనే కాల్ కట్ చేసి, నంబర్ బ్లాక్ చేయాలని, 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.