BDK: చర్ల పోలీస్ గ్రౌండ్స్‌లో అండర్-17 బాలుర రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలను సోమవారం ప్రారంభించారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఎస్పీ పేర్కొన్నారు. నవంబర్ 23 నుంచి 25 వరకు పోటీలు జరగనున్నాయి.
తెలంగాణ
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం


