హైదరాబాద్: 28°C
తెలంగాణ

తురక కాశీ కుల వృత్తిదారులకు పనిముట్లు పంపిణీ

HNK: కులవృత్తిదారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు, నడికూడ మండలాలకు చెందిన 23 మంది తురక కాశీ కుల వృత్తిదారులకు పనిముట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.