WNP: వరి కోతల అనంతరం పొలాల్లో మిగిలిన వరి కొయ్యలను కాల్చవద్దని మండల వ్యవసాయ అధికారి రమేశ్ రైతులకు సూచించారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల భూసారం తగ్గి, రాబోయే పంటల్లో ఎరువుల ఖర్చులు పెరగడంతో పాటు దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు. మంటల వేడికి నేలలోని సూక్ష్మజీవులు, వానపాములు చనిపోతాయని తెలిపారు. రైతులు పంట అవశేషాలను నేలలో కలిపి భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు.
తెలంగాణ
'రైతులు వరి కొయ్యలను కాల్చవద్దు'


