హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ వివాదం నేపథ్యంలో కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్యాయత్నం

ADB: భూ వివాద సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆదిలాబాద్ కలెక్టరేట్ ప్రజావాణిలో సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బోరజ్ మండలంలోని మాండగాడకు చెందిన దేవన్న తన సమస్యపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చి ఒక్కసారిగా పురుగుల మందు సేవించాడు. అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆటోలో రిమ్స్‌కు తరలించారు.