VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు నస్కల్ వ్యవసాయ పొలాల్లో చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిరుత కదలికలను గుర్తించేందుకు నాలుగు ట్రాప్ కెమెరాలు, ఒక సోలార్ కెమెరాను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. రైతులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
చిరుత కలకలం.. అప్రమత్తంగా ఉండండి


