MDK: కార్తీక పౌర్ణమి సందర్భంగా కౌడిపల్లిలోని రామాలయం నుంచి శ్రీశ్రీశ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమం వరకు శివ పంచాక్షరి మంత్రోచ్ఛారణల నడుమ భక్తులు ఊరేగింపుగా వెళ్లారు. ఆశ్రమంలోని మహా శివలింగానికి 108 కలశాలతో భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు రమాదేవి, ప్రతాపరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో శివభక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 108 కలశాలతో మహా శివాభిషేకం


