హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 30న గిరిజన సమైక్య ధర్నా

ఖమ్మం నగరంలో సోమవారం గిరిజన సమైక్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అజ్మీరా రామ్మూర్తి మాట్లాడారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. గిరిజన హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.