హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు

వరంగల్‌ నగరంలోని కాశిబుగ్గ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీకమాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివయ్యకు 21 కిలోల పెరుగుతో విశేష అభిషేకం నిర్వహించి మహా హారతి సమర్పించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు.