హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి'

NRML: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, గడువులోగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.