SRD: కంగ్టి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం MPO లక్ష్మణ్ అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజావాణికి కేవలం ఒకే ఒక్క దరఖాస్తు అందినట్లు ఎంపీవో తెలిపారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్ మున్నీతో పాటు పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ


