MDK: లక్ష్మాపూర్ 765 డీజీ రోడ్డు నుంచి కామారెడ్డి జిల్లా ఆరేపల్లితండా వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని దంతేపల్లి సర్పంచ్ మస్కూరి బాలరాజు కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో అ. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రహదారి సౌకర్యం లేక 22 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజా అవసరాల దృష్ట్యా నిధులు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'22 గ్రామాలకు డబుల్ రోడ్డు వేయాలి'


