హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ పత్తి విత్తనాలతో మోసపోయిన రైతు

BDK: చంద్రుగొండ మండలం నకిలీ పత్తి విత్తనాలతో 3 ఎకరాల పంట నష్టపోయానని రావికంపాడుకు చెందిన రైతు మాలోత్ రమేష్ ప్రజావాణిలో సోమవారం కలెక్టర్‌ అంకిత్‌కు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ అధికారుల పరిశీలన జరిగినా ఇప్పటివరకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత విత్తన కంపెనీ, డీలర్‌పై విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు. తగిన నష్టపరిహారం అందించాలని కోరారు.