హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఎంపీడీవోకు వినతి

JGL: సారంగాపూర్ మండలంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, తక్షణమే ధాన్యం కొనాలని బీఆర్ఎస్ నాయకులు, రైతులు సోమవారం ప్రజావాణిలో ఎంపీడీఓ నీరజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కల్లాల్లో ధాన్యం సిద్ధంగా ఉన్నా కొనుగోళ్లు జరగక పోవడంతో అకాల వర్షాల భయంతో పాటు, ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.