హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదాలు జరిగాకే అధికారుల స్పందనా?

VKB: కెరెల్లి వెళ్లే మార్గంలో లారీ ఆటోను ఢీకొని నలుగురు మృతి చెందిన ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాతే ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మలుపుల వద్ద ముందుగానే చెట్లను తొలగిస్తే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొంటున్నారు. ప్రమాదాలు జరిగాక చర్యలు చేపట్టడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.