SRPT: జిల్లా కేంద్రానికి చెందిన లారీ హైదరాబాద్ నుంచి నకిరేకల్ మీదుగా తిరిగి వస్తుండగా, కేతేపల్లి మండల శివారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెనుక వస్తున్న మరో లారీ డ్రైవర్ అప్రమత్తం చేయడంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశాడు. కొద్దిసేపటికే మంటలు వ్యాపించడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీలో వివిధ రకాల ఆయిల్స్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ
కేతేపల్లి మండల శివారులో లారీ దగ్ధం


